
ప్రజాశక్తి - పాలకొల్లు
వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ, న్యాయానికి జగన్ సంకెళ్లు వేశాడని ఎంఎల్‌ఎ నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆదివారం రాత్రి ఎంఎల్‌ఎ నిమ్మల రామానాయుడు, మాజీ ఎంఎల్‌సి అంగర రామ్మోహన్ గాంధీ బొమ్మ సెంటర్ వద్ద చేతులకు నల్లతాడు, రిబ్బన్‌తో సంకెళ్లు కట్టుకొని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి బాబు, జివి, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.
పెనుమంట్ర : చంద్రబాబుకు కోర్టు నోటీసులు పలు సార్లు వాయిదా పడడం సరికాదని మాజీ మంత్రి టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు పితాని సత్యనారాయణ తనయుడు వెంకట్ అన్నారు. ఆదివారం మార్టేరు సెంటర్లో న్యాయానికి సంకెళ్లు కార్యక్రమంలో భాగంగా చేతులకు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. ఈ, కార్యక్రమంలో మండల అధ్యక్షులు తమనంపూడి శ్రీనివాసరెడ్డి (బుల్లాలు), మండల కార్యదర్శి మోహన్‌రావు, ఆచంట కేతా మీరయ్య , పోడూరు మండలం గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు పాల్గొన్నారు.
మొగల్తూరు : చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా పార్టీ నాయకులు ఆదివారం రాత్రి చేతులకు సంకెళ్లు వేసుకుని గ్రామంలో నిరసన ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గుబ్బల నాగరాజు, కలిదిండి కుమార్‌బాబు, బోల్ల చంటి, పాల రాంబాబు పాల్గొన్నారు.
ఆకివీడు : టిడిపి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి వినూత్న రీతిలో నేతలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ స్థానిక మెయిన్ సెంటర్లోని గాంధీ విగ్రహం వద్ద నేతలు చేతులకు నల్ల రిబ్బన్లతో సంకెళ్లు వేసుకుని నిరసన తెలిపారు. టిడిపి మండల అధ్యక్షులు మోటిపల్లి ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
ఆచంట:వైసిపివి కక్షపూరిత రాజకీయాలని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఆచంటలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం 33వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా దీక్షలకు సంఘీభావం తెలిపారు. అనంతరం రిలే దీక్షలనుద్దేశించి ఆయన మాట్లాడారు. త్వరలోనే వైసిపి ప్రభుత్వ అరాచకాలకు ప్రజలు స్వస్తి చేప్పే రోజులు దగ్గరలొనే ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి ఉప్పలపాటి సురేష్‌బాబు, ఎంపిపి దిగమర్తి సూర్యకుమారి, నేతలు కేతా మీరయ్య, నెక్కంటి ప్రభాకర్ రావు పాల్గొన్నారు.
పాలకొల్లు : జగన్ పాలనలో న్యాయానికి సంకెళ్లు వేశారని ఎంఎల్‌ఎ నిమ్మల రామానాయుడు చెప్పారు. స్థానిక గాంధీ బొమ్మ సెంటర్ వద్ద 33వ రోజు ఆదివారం గవర కులస్తులు దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా వారు చేతులకు నల్ల రిబ్బన్లు కట్టుకుని జగన్ ప్రభుత్వ వైఖరికి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ పరిపాలన కన్నా ప్రతిపక్షాలను అణగదొక్కడమే ధ్యేయంగా పాలన చేశారని విమర్శించారు.