Oct 09,2023 21:28

అనంతపురంలో మాట్లాడుతున్న మాజీమంత్రి కొల్లు రవీంద్ర

        ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌    చంద్రబాబు కేసుల విషయంలో కోర్టు తీర్పులు చూస్తుంటే న్యాయవ్యవస్థపై అనుమానాలు కలుగుతున్నాయని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. అనంతపురం నియోజకవర్గం కమిటీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారం 27వ రోజుకు చేరుకున్నాయి. టిడిపి ఎస్సీ సెల్‌ విభాగం నాయకులు బంగి నాగ తదితరులు చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన తెలిపారు. దీక్షా శిబిరాన్ని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం అంటూ రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ఆరోపణలతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుని జైల్లో బంధించారని మండిపడ్డారు. నిరాధార ఆరోపణలతో 31 రోజుల పాటు జైలులో పెట్టడం రాజకీయ కక్షతో చేసినట్లు ఉందన్నారు. న్యాయవ్యవస్థలపై మాకు ఎంతో విశ్వాసం ఉందన్నారు. వీరి దీక్షలకు జనసేన పార్టీ నేతలు టిసి.వరుణ్‌, శ్రీలత, పత్తి చంద్రశేఖర్‌ తదితరులు హాజరై సంఘీభావం తెలిపారు.
రాయదుర్గం : సర్వోన్నత న్యాయస్థానంలో చంద్రబాబుకు న్యాయం దక్కుతుందని, వెంటనే బయటకు వస్తారని గట్టిగా విశ్వసిస్తున్నట్లు టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు కాలవ శ్రీనివాసులు తెలిపారు. పట్టణంలోని టిడిపి కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన ముస్లిం మైనార్టీల రిలే దీక్ష శిబిరంలో సోమవారం కాలవ ప్రసంగించారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ అన్ని వర్గాల ప్రజలు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు నాగరాజు, మండల కన్వీనర్లు హనుమంతరెడ్డి, లాలెప్ప, గిరిమల్లప్ప, హనుమంతు, కడ్డిపూడి మహబూబ్‌బాషా, గౌస్‌, సాలర్‌ బాషా, జమీల్‌ఖాన్‌, ఉస్మాన్‌, జిలాన్‌, ఇనాయత్‌బాషా, జావీద్‌, ఖలందర్‌, సనావుల్లా, చాంద్‌, మాబూ, ఇస్మాయిల్‌, షమీ, వెంకటేశులు, వార్డు సభ్యురాలు ప్రశాంతి, భారతి, పురుషోత్తం, సుమలత, వాజిద్‌, హమీద్‌, తదితరులు పాల్గొన్నారు.