May 07,2023 01:05

పిఠాపురంలో సదస్సులో మాట్లాడుతున్న సీనియర్‌ సివిల్‌ జడ్జి మాధవి . ... పెద్దాపురం సదస్సులో మాట్లాడుతున్న సీనియర్‌ సివిల్‌ జడ్జి సరస్వతి


ప్రజాశక్తి - పిఠాపురం:
రాజ్యాంగ సవరణకు సంబంధించి పార్లమెంటుకు ఉన్న విస్తృత అధికారాలను కుదిస్తూ, అదే సమయంలో ఎలాంటి సవరణనైనా సమీక్షించే అధికారాన్ని న్యాయవ్యవస్థకు కట్టబెడుతూ రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతంపై 1973లో సుప్రీంకోర్టు వెలువరించిన చారిత్రక 'కేశ వానంద భారతి తీర్పుకు 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం పిఠాపురం 12 అదనపు జిల్లా కోర్టు హాల్లో మండల లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సును పిఠాపురం 12వ అదనపు జిల్లా జడ్జి ఎ.వాసంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీనియర్‌ సివిల్‌ జడ్జి కే మాధవి మాట్లాడుతూ కేశవానంద భారతి వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళగా పేర్కొనబడే ఈ కేసులో ఏప్రిల్‌ 24, 1973న సంవత్సరంలో 13 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 7.6 మెజారిటీతో తీర్పు వెలువరించిందని చెప్పారు. యావత్‌ ప్రపంచ పరిశోధకులు చూసేం దుకు వీలుగా కేసుకు సంబంధించి ఉన్న లిఖిత పూర్వక దస్త్రాలతో పాటు అన్ని వివరాలతో కూడిన ప్రత్యేక వెబ్‌ పేజీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ సదస్సులో ఆల్‌ ఇండియా లాయర్స్‌ యూనియన్‌ జిల్లా కార్యదర్శి గుదిమెళ్ళ శ్రీభాస్కరాచార్యులు, న్యాయవాదులు పి.రాజేంద్ర ప్రసాద్‌, కొంగు నూకరాజు, ఎస్‌.కె అబ్బార్ష, డి .రమేష్‌ బాబు, ఎన్‌ కష్ణవేణ, బి ప్రేమ సునందరావు, అల్లాడ గీత తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగ పరిరక్షణలో సుప్రీంకోర్టుదే కీలకపాత్ర
- సీనియర్‌ సివిల్‌ జడ్జి సరస్వతి
ప్రజాశక్తి - పెద్దాపురం
రాజ్యాంగ పరిరక్షణలో సుప్రీంకోర్టు కీలక పాత్ర పోషిస్తుందని సీనియర్‌ సివిల్‌ జడ్జి, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ ఎన్‌ సరస్వతి అన్నారు. మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కేశవానంద భారతి కేసు తీర్పు జరిగి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శనివారం స్థానిక సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో జరిగిన న్యాయవిజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడారు. ఈనెల 13 న పెద్దాపురం కోర్టులో జాతీయ లోక్‌ అదాలత్‌ జరుగుతుందన్నారు. మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అర్హులైన వారికి ఉచిత న్యాయ సహాయం అందింస్తారన్నారు. ఈ అవకాశాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సదస్సులో 7 వ అదనపు జిల్లా కోర్టు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పేరిశెట్టి మత్యుంజయరావు, ప్యానల్‌ న్యాయవాదులు మడికి రాంబాబు,అత్తిలి ప్రభూజి,రాగం కామేశ్వరరావు,వల్లి బాబు,గణేష్‌, విజయలక్ష్మిలు ప్రసం గించారు. పారా లీగల్‌ వాలంటీర్లు మాసా చంద్రరావు (చందు), భళ్లమూడి సూర్యనారాయణ మూర్తి, నూతలపాటి అప్పలకొండ, బుద్దా రామకృష్ణ, లక్ష్మి,రెహమాన్‌,సిబ్బంది శ్రీనివాసరావు,శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.