Nov 09,2023 21:17

ర్యాలీని ప్రారంభిస్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి

 కడప : దేశవ్యాప్తంగా ఎటు వంటి రుసుం లేకుండా న్యాయ సేవలను అందిం చడమే న్యాయ సేవల దినో త్సవం ముఖ్య లక్ష్యం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. శ్రీదేవి, అడిషనల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎం. ప్రదీప్‌ కుమార్‌ అన్నారు. గురువారం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో 'న్యాయ సేవల దినోత్సవం' ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా జిల్లా కోర్టులోని న్యాయ సేవాసదన్‌ భవన్‌లో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ న్యాయ సేవల దినోత్సవం ప్రాముఖ్యతను తెలియజేశారు. మహిళలు, విక లాంగులు , షెడ్యూల్‌ తెగలు , పిల్లలు, షెడ్యూల్‌ కులాలు, మానవ అక్రమ రవాణా బాధితులు అలాగే ప్రకతి వైపరీత్యాల బాధితులైన బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సేవలను అందిస్తున్నామని తెలిపారు. అనంతరం కడప కోర్టు ఆవరణం నుంచి కోటిరెడ్డి సర్కిల్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి జి.గీతా, నాలుగవ అదనపు జిల్లా న్యాయమూర్తి జి.దీన బాబు, ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జ్‌ కం చీఫ్‌ జ్యుడీ షియల్‌ మెజిస్ట్రేట్‌ ఎస్‌.కవిత, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఇ.ప్రసూన, రెండవ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కె.భార్గవి, ఎక్సైజ్‌ కోర్టు జడ్జి జై.హేమ స్రవంతి, బార్‌ ప్రెసిడెంట్‌ జి.వి. రాఘవరెడ్డి, ప్యానల్‌ న్యాయవాదులు పాల్గొన్నారు.