న్యాయ రాజధాని అంటూ రాయలసీమకు ద్రోహం
రాయలసీమ స్టీరింగ్ కమిటీ చైర్మన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి
ప్రజాశక్తి - శ్రీశైలం ప్రాజెక్టు
కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తానని రాయలసీమకు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని రాయలసీమ స్టీరింగ్ కమిటీ చైర్మన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. రాయలసీమ స్టీరింగ్ కమిటీ విస్తృత సమావేశం సోమవారం సుండి పెంటలో రెడ్ల కళ్యాణ మండపము నందు నిర్వహించారు. సమావేశం విలేకరులతో రాయలసీమ స్టీరింగ్ కమిటీ చైర్మన్ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మాట్లాడారు. సంగమేశ్వరం వద్ద బ్రిడ్జి కం బ్యారేజ్ కడితే బాగుంటుందని అన్నారు. రాయల సీమ వాసులై ఉండి రాయలసీమకు సువర్ణ అవకాశం ఉన్న బాగు చేయడం లేదన్నారు. రాయలసీమ గురించి ఎంపీలు గాని, ఎమ్మెల్యేలు ఏమి మాట్లాడటం లేదని అన్నారు. నీటి నిల్వలు తగ్గిపోయిన తెలంగాణ రాష్ట్రం ఇంకా నీటిని వాడుతున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కుమ్మక్కై ఈ పని చేస్తున్నారన్నారు. కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తానని సిఎం జగన్ రాయలసీమా న్యాయవాదుల గొంతు కోశారన్నా రు. కర్నూలు ఉమ్మడి జిల్లాలోని గుండ్రేవుల, వేదవతి ప్రాజెక్టుల గురించి ఊసే లేదన్నారు. శ్రీశైలం దేవస్థానంలో నియామకాలపై సిటింగ్ జడ్జితో విచారించాల న్నారు. రాయలసీమలోని 52 నియోజక వర్గాలలో ఈనెల 7న సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టబో తున్నామన్నారు. కర్తవ్య దీక్షలో పాల్గొన్న దాదాపు 8 జిల్లాల వారికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన మద్దతు పలికిన వారికి కృతజ్ఞతలు తెలుపుతు న్నామన్నారు. ఈ సమావేశంలో రాయలసీమ స్టీరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.










