Apr 20,2023 23:49

న్యూస్‌ మ్యాగజైన్‌ స్వగత్‌,కాకినాడ బయోడైవర్శిటీ రిపోర్టును ఆవిష్కరిస్తున్న విసి ప్రసాద్‌ రాజు, ప్రొఫెసర్లు

ప్రజాశక్తి - కాకినాడ
జెఎన్‌ టియుకె ప్రాంగణంలో గురువారం విసి కాన్ఫరెన్స్‌ హాలులో నేషనల్‌ అసెస్మెంట్‌ అండ్‌ అక్రిడిటేషన్‌ కౌన్సిల్‌ (న్యాక్‌) టీమ్‌ పర్యటనపై ఉపకులపతి జివిఆర్‌.ప్రసాదరాజు యూనివర్శిటీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మే 9, 10, 11 తేదీలలో న్యాక్‌ టీమ్‌ యూనివర్శిటీని సందర్శించనున్న నేపథ్యంలో విభాగాల వారీ చేపట్టాల్సిన పనులను త్వరిత గతిన పూర్తిచేయాలన్నారు. జెఎన్‌టియుకె మొదటిగా 2017 నుండి 2022 వరకు న్యాక్‌ గుర్తింపు పొందిందని, రెండవ సారి యూనివర్శిటీ న్యాక్‌ గుర్తింపు పొందేందుకు గాను మే నెల 9, 10, 11 తేదీలలో న్యాక్‌ టీమ్‌ పర్యటిస్తోందన్నారు. ముఖ్యంగా యూనివర్శిటీ అవలంభిస్తున్న బోధన అభ్యసన పద్ధతులు, పాఠ్య ప్రణాళికలు, అధ్యాపకులు, పరిశోధన, మౌలిక సదుపాయాలు, అభ్యసన వనరులు తదితర అంశాలకు చెందిన వివరాలను అందు బాటులో ఉంచాలన్నారు. న్యాక్‌ టీమ్‌ సందర్శనకు సంబంధించి ఏర్పా టుచేసిన కమిటీల పనుల పురోగతిని ఉపకులపతి అడిగి తెలుసుకున్నారు.
న్యూస్‌ మ్యాగజైన్‌ స్వగత్‌,
కాకినాడ బయోడైవర్సిటీ రిపోర్టు ఆవిష్కరణ
జెఎన్టియుకె ప్రాంగణంలో గురువారం విసి కాన్ఫరెన్స్‌ హాలులో డైరెక్టర్‌, అకడమిక్స్‌ అండ్‌ ప్లానింగ్‌ (డిఎపి) ఆధ్వర్యంలో రూపొందించిన యూనివర్శిటీ న్యూస్‌ మ్యాగజైన్‌ స్వగత్‌, కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ సహకారంతో రూపొందించిన కాకినాడ బయోడైవర్శిటీ రిపోర్టును ఉపకులపతి జివిఆర్‌.ప్రసాద రాజు ఆవిష్కరించారు. అనంతరం ప్రసాదరాజు మాట్లాడుతూ యూనివర్శిటీ, అనుబంధ కళాశాలలకు సంబంధించిన వివరాలు, కోర్సులు, వర్క్షాప్స్‌, సెమినార్‌లపై ప్రతీ 6 నెలలకు మ్యాగజైన్‌ రూపొందిస్తు న్నామన్నారు. అదేవిధం.దా కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ సహకారంతో రూపొందించిన కాకినాడ బయోడైవర్శిటీ రిపోర్టులో కాకినాడ నగర విస్తీర్ణం, పక్షులు, సర్ప జాతులు, జంతు జాతులు, వక్ష జాతులు, చెట్లు, పక్షులు, నగర జనాభా, గహాలుతదితర అంశాలను పొందురచినట్టు విసి తెలిపారు.
ఎంబిఎ విద్యార్థుల ఎక్స్‌ఫ్లోర్‌-2బి23
జెఎన్‌ టియుకె ప్రాంగణంలో స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్మెంట్‌ స్టడీస్‌ (ఎస్‌ఎంఎస్‌) విభాగం ఆధ్వర్యంలో ఎక్స్‌ఫ్లోర్‌-2బి23 మేనేజ్మెంట్‌ ఫెస్ట్‌ను గురువారం నిర్వహించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉపకులపతి జివిఆర్‌.ప్రసాదరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంబిఏ విద్యార్థులకు ప్రాజెక్ట్లు, పేపర్‌ ప్రజంటేషన్‌, పోస్టర్‌ ప్రజంటేషన్‌, టెక్నికల్‌ క్విజ్‌లు నిర్వహించారు. కార్యక్రమంలో ఒఎన్‌జిసి కాకినాడ అసెట్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రత్నీష్‌ కుమార్‌, రెక్టార్‌ కెవి. రమణ, రిజిస్ట్రార్‌ ఎల్‌.సుమలత, ఒఎస్‌ డి.కోటేశ్వరరావు, యుసిఇకె ప్రిన్సిపాల్‌ ఎంహెచ్‌ఎం. కృష్ణప్రసాద్‌ డైరెక్టర్లు, స్పెషల్‌ ఆఫీసర్లు, యుసిఇకె ప్రిన్సిపాల్‌, వైస్‌ ప్రిన్సిపాల్స్‌, విభాగాధిపతులు, అధ్యాపకులు, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.