మంగళగిరిరూరల్: నవులూరు లేఔట్‌లో రెండో రోజు సోమవారం పట్టాల పంపిణీ కార్యక్రమం సాగింది. ఎమ్మెల్యే ఆర్కే అర్హులైన లబ్ధిదారులకు పట్టాల పంపిణీ చేశారు. నవులూరు లేఔట్ లో ఎర్రబాలెం 1, 2, 3 సచివాల యాల పరిధిలోని సుమారు 500 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ ఇల్లు లేని నిరుపేద ఒక్కరు కూడా ఉండకూడదని మహా సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని తెలిపారు. పేదవాడి సొంత ఇంటి కల నెరవేరబోతున్న తరుణంలో ప్రతిపక్ష పార్టీలు అవరోధాలు సష్టిస్తూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని అవరోధాలు సష్టించిన రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల పక్షాన నిలబడి ప్రతి పేదవాడి చిరకాల స్వప్నం సొంత ఇంటి కల నెరవేర్చి, వారికి అండగా నిలబడుతుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్వో రాంప్రసాద్, రెవెన్యూ అధికారులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










