
ప్రచారం నిర్వహిస్తున్న నాయకులు
నవరత్నాలతో ప్రతి ఒక్కరికీ లబ్ధి
ప్రజాశక్తి-సీతారామపురం:రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలతో ప్రతి ఇంట సంక్షేమ వెలుగులు కనిపిస్తున్నాయని ఉదయగిరి నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని సీతారామపురం బిట్ -1 పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. గడపగడపకు వెళ్లి సంక్షేమ పథకాలను వివరించి, బుక్ లెట్‌లను లబ్ధిదారులకు అందజేశారు. పనితీరు ప్రభుత్వ పనితీరు సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యలపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ, ప్రస్తుత ప్రభుత్వ పాలనలోని వ్యత్యాసాన్ని ప్రజలు గమనించాలని, గతంలో టిడిపి జన్మభూమి కమిటీలను ప్రసన్నం చేసుకుంటేనే సంక్షేమ పథకాలు అందేవని గుర్తు చేస్తూ, ప్రస్తుతం తమ ప్రభుత్వం సచివాలయ వ్యవస్థ ద్వారా అర్హులందరికీ పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందజేస్తుందని తెలిపారు. రాబోయే 2024 ఎన్ని కలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్య మంత్రిగా ఎన్నుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ చింతం రెడ్డి పద్మావతి, జెడ్‌పిటిసి చెరుకు పల్లి రమణారెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ చింతం రెడ్డి సుబ్బారెడ్డి పాల్గొన్నారు.