చెక్కు అందజేస్తున్న కలెక్టర్ రవి, జెసి కల్పనాకుమారి
ప్రజాశక్తి-అనకాపల్లి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నవరత్న పథకాలు 2022-23 ద్వైవార్షిక కాలానికి జిల్లాకు చెందిన 83,533 మంది లబ్ధిదారులకు రూ.11.85 కోట్ల చెక్కును మంగళవారం కలెక్టర్ రవి పఠాన్ శెట్టి చేతుల మీదుగా విడుదల చేశారు. స్థానిక కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అర్హులైన ఏ ఒక్కరు పథకాలకు దూరం కాకూడదని ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరో అవకాశం ఇచ్చారన్నారు. అర్హులై పథకాలకు అందనివారు నెలలోపు తమ వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జెసి కల్పన కుమారి, డిఆర్‌ఓ వెంకటరమణ, డిఎల్‌డిఓ మంజుల వాణి, సంబంధిత అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.










