Jan 13,2023 23:52

మాట్లాడుతున్న పిఒ సూరజ్‌ గనోరే

ప్రజాశక్తి - రంపచోడవరం
నవోదయ విశ్వవిద్యాలయంలో ఆరవ తరగతిలో ప్రవేశానికి నిర్వహించే అర్హత పరీక్షకు అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్‌ గనోరే తెలిపారు. శుక్రవారం ఆయన స్థానిక ఐటిడిఏ కార్యాలయంలోని తన చాంబర్లో విలేకర్లతో మాట్లాడుతూ ఈ నెల 31లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని, ఈ ఏడాది ఏప్రిల్‌ 29న రంపచోడవరం, కూనవరం, ఏటపాక మండల కేంద్రాలలో అర్హత పరీక్ష ఉంటుందని వెల్లడించారు. 3, 4 తరగతులు ప్రభుత్వం గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుకున్న వారు దీనికి అర్హలని పేర్కొన్నారు. 2022-2023 విద్యా సంవత్సరంలో 5వ తరగతి పాస్‌ కావాల్సి ఉందని తెలిపారు. అభ్యర్థులు 2011 మే 1 నుండి 2013 ఏప్రిల్‌ 30వ తేదీ మధ్య జన్మించి ఉండాలన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు షషష.అaఙశీసaya.స్త్రశీఙ.×అ ద్వారా ఆన్‌లైన్‌లో ఉచితంగా దరఖాస్తులు తీసుకువచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు 7668654709, 9705852243, 6300624049, 9948999589 ఫోన్‌ నెంబర్లకు సంప్రదించాలని సూచించారు. ఈ నవోదయ దరఖాస్తుల ప్రక్రియను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని రంపచోడవరం ఐటీడీఏ ఏపీవో సిహెచ్‌ శ్రీనివాసరావును ప్రాజెక్ట్‌ అధికారి ఆదేశించారు.