Mar 02,2023 22:42

ప్రజాశక్తి-నందిగామ 

విజయవాడ తరువాత అభివద్ధి చెందిన పట్టణంగా నందిగామను తీర్చిదిద్దుతున్నామని నందిగామ ఎంఎల్‌ఎ మొండితోక జగన్మోహనరావు, ఎంఎల్సి మొండితోక అరుణ్‌ కుమార్‌ లు పేర్కొన్నారు. నందిగామ పట్టణంలోని నగర పంచాయతీ కార్యాలయం వద్ద గాంధీ సెంటర్‌ టు చందాపురం బైపాస్‌ వరకు గల చందర్లపాడు రోడ్డు అభివద్ధిలో భాగంగా సీఎస్‌ఆర్‌ నిధులతో చేపట్టిన నిర్మాణ పనులకు జగన్‌ మోహన్‌ రావు, అరుణ్‌ కుమార్‌ గురువారం శంకుస్థాపన నిర్వహించారు .ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్‌ మొండితోక అరుణ్‌ కుమార్‌ మాట్లాడుతూ నందిగామ పట్టణాన్ని నవ నందిగామ గా తీర్చిదిద్దుతామని, పట్టణ అభివద్ధిలో భాగంగా చేపడుతున్న రోడ్డు విస్తరణ పనులకు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ మహమ్మద్‌ మస్తాన్‌, నగర పంచాయతీ కమిషనర్‌ డాక్టర్‌ జయరాం, ఏఈ ఫణి శ్రీనివాస్‌, వైస్‌ చైర్మన్‌ మాడుగుల నాగరత్నమ్మ పాల్గొన్నారు .