ప్రజాశక్తి-పాడేరుటౌన్:2022-23 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో 528 మార్కులు సాధించి అల్లారి జిల్లా ముంచంగిపుట్టు మండల టాపర్ గా నిలిచిన ముగ్గు పైడి నవనీత్ ఎపి ఐక్య జంగమ సంక్షేమ సంఘం నుంచి ప్రతిభ పురస్కార అవార్డు అందుకున్నారు. ఆదివారం విశాఖపట్నం డాబా గార్డెన్స్ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఆత్మీయ కలయికలో నవనీత్‌ను అభినందించి ప్రతిభా పురష్కార అవార్డును అందించారు. పాడేరులో ఒక ప్రముఖ తెలుగు దినపత్రికలో వివేఖరిగా పని చేస్తున్న ముగ్గు మహేష్ బాబు తనయుడు నవనీత్ ముంచంగిపుట్టు మండలం జోలాపుట్టు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలలో చదువుకున్నాడు. 10 ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో టాపర్లుగా నిలిచిన జంగమ కుటుంబానికి చెందిన 14 మంది విద్యార్థులను జంగమ రాష్ట్ర సంఘం ఎంపిక చేసింది. ఈ సందర్భంగా నవనీత్‌కు రాష్ట్ర సంఘం ప్రతిభా పురస్కార అవార్డుతో పాటు రూ. 5వేలు నగదును ఆ సంఘం పెద్దల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో లోకనాధం, ఆనందరావు, గుంపు స్వామి, నర్సింగరావు, సూర్యనారాయణ, కోటేశ్వరరావు, నరేంద్ర, ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.










