
ప్రజాశక్తి - చెరుకుపల్లి
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడానికి నిరసనగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నవంబర్ 8న విద్యాసంస్థల బందును నిర్వహిస్తున్నట్ల ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు పి మనోజ్‌కుమార్ అన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను మానుకోవాలని అన్నారు. కడపలో ప్రభుత్వ ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలని కోరారు. ఎస్ఎఫ్ఐ, విద్యార్థి, యువజన సంఘాల పిలుపుమేరకు నవంబర్ 8న జరగనున్న విద్యాసంస్థల రాష్ట్ర వ్యాప్తంగా బందు విజయవంతం చేయాలని కోరారు. మండలంలోని కావూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం గోడ పత్రాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు వసంత్, సుదీష్ పాల్గొన్నారు.