
ప్రజాశక్తి - రాజమహేంద్రవరం నవంబర్ ఒకటి నుంచి ఎంపికి జగన్ ఎందుకు కావాలి? అనే సంస్థగత కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించిందని, ప్రతిష్టాత్మంగా పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని వైసిపి సిటి కో-ఆర్డినేటర్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. వైసిపి నగర అధ్యక్షులు అడపా శ్రీహరి అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎపి కి జగనే ఎందుకు కావాలి అంటే..స్కామ్‌లు లేని పారదర్శక పాలన చేస్తున్నందుకు..అవినీతి, లంచాలు లేకుండా అర్హులకు పింఛన్లు అందిస్తున్నందుకు అని చెప్పాలన్నారు. మన జగన్మోహన్ రెడ్డి సిఎం అయిన ఈ నాలుగున్నరేళ్లలో ఎన్నో విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టారన్నారు. పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చారన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేశారని, గ్రామ, వార్డు సచివాలయాలను ప్రజలు ముంగిటకు తీసుకొచ్చారని, గ్రామీణ ప్రాంతాల్లో 92 శాతం, పట్టణ ప్రాంతాల్లో 87 శాతం కుటుంబాలకి మంచి చేసినందుకే ఎపికి జగన్ కావాలన్నారు. ఈ సమావేశంలో క్లస్టర్ అధ్యక్షులు మజ్జి అప్పారావు, పోలు విజయలక్ష్మి, క్లస్టర్, డివిజన్ ఇన్‌ఛార్జులు మార్తి లక్ష్మి, కుక్కా తాతబ్బాయి, నగేష్ చంద్రారెడ్డి (గణేష్), కంచుమర్తి చంటి, దాసి వెంకట్రావు, బల్ల శ్రీనివాసరావు, దుంగ మంగా, లంక ప్రసాద్, సయ్యిద్ గౌస్ మొహిద్దిన్, తదితరులు పాల్గొన్నారు.