Jul 15,2023 20:39

ధర్నా నిర్వహిస్తున్న నాయకులు

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
ఎమ్మిగనూరు ప్రభుత్వాస్పత్రిలో నవజాతా శిశువుల వార్డును, కాన్పుల వార్డును ప్రారంభించాలని సిపిఐ నాయకులు కోరారు. శనివారం సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వాస్పత్రి ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి జి.రంగన్న, నాయకులు భాస్కర్‌ యాదవ్‌, మండల కార్యదర్శి బిటి.చిన్నన్న మాట్లాడారు. మాచాని గంగప్ప ప్రభుత్వాస్పత్రికి ఒక ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజవర్గాలకు చెందిన గర్భిణులు ప్రసవాల కోసం ఆస్పత్రికి వస్తారని చెప్పారు. ఆస్పత్రిలో నవజాతా శిశువుల వార్డు ఏర్పాటు చేసినా ప్రారంభానికి నోచుకోకపోవడం దారుణమన్నారు. ఎమ్మెల్యే చొరవ తీసుకుని నవజాతా శిశువుల వార్డును ప్రారంభించాలని కోరారు. లేకపోతే సిపిఐ ఆధ్వర్యంలో దశలవారీ పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి సమీవుల్లా, నాయకులు బజారి, కెసి.జబ్బార్‌, తిమ్మగురుడు, హనుమంతు, సుంకన్న, ఖాజా, మాలిక్‌, రంగస్వామి, రాజీవ్‌, విజయేంద్ర, ఖాదర్‌, నరసింహులు, లక్ష్మన్న, మన్సూర్‌, సోమశేఖర్‌, వలీ, షరీఫ్‌, వీరేష్‌, రామాంజి, నూర్‌, బషీర్‌ పాల్గొన్నారు.