నవీ ముంబైలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం
టీటీడీ, సింఘానియా గ్రూప్ మధ్య అవగాహన ఒప్పందం
ప్రజాశక్తి - తిరుమల
నవీ ముంబైలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి మంగళవారం తిరుమలలోని సింఘానియా గ్రూప్‌తో ఎంఓయూ కుదుర్చుకుంది. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి, రేమండ్ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ హరి సింఘానియా సమక్షంలో ఈ మేరకు ఒప్పందం జరిగింది. అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ, ముంబాయి ఉల్వే ప్రాంతంలో మహారాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 10 ఎకరాల భూమిలో రూ.70 కోట్లతో శ్రీవారి ఆలయాన్ని నిర్మించేందుకు దాత ముందుకు వచ్చారని తెలిపారు. ఈ ఆలయ నిర్మాణాన్ని త్వరలో ప్రారంభించి ఏడాది కాలంలో పూర్తి చేస్తామని ఆయన చెప్పారు.ఈ కార్యక్రమంలో సిఈ నాగేశ్వరరావు, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, డిప్యూటీ ఈవో (డోనర్ సెల్) సెల్వం తదితరులు పాల్గొన్నారు.
టిటిడితో సింఘానియా గ్రూప్ ఒప్పందం










