ప్రజాశక్తి- రణస్థలం రూరల్: నవధాన్యాలు వేయడం వల్ల రైతులకు ఎంతో లాభాలను చేకూరుతుందని ప్రకృతి వ్యవసాయ యూనిట్ ఇన్‌ఛార్జి గంట్యాడ ఏసుబాబు అన్నారు. మండలంలోని ఉప్పువలసలో పప్పల భాస్కరరావు 25 ఎకరాలు కొబ్బరి తోటలో నవధాన్యాలు వేసిన దానిని ఎన్‌ఎఫ్‌ఎ చంద్రభాను గురువారం పరిశీలించారు. పంట కోత ప్రయోగం చేసి దానివల్ల లాభాలు గురించి రైతులకు వివరించారు. ఈ నవధాన్యాలు కొబ్బరి, వరి ఆకు వేసే ముందు వేయడం వల్ల వేసిన 45 రోజులు తర్వాత కలియ దున్నాలని అన్నారు. దమ్ము పట్టి నాట్లు వేసుకున్నట్లయితే దానివల్ల నేల సారవంతం, మట్టి గుల్లలవుతు వానపాములు అభివృద్ధి చెందుతుందన్నారు. యూరియా, డిఎపి వేయనవసరం లేదన్నారు. కొబ్బరిలో అయితే 45 రోజుల తర్వాత కలియ దున్నట్లయితే దాని వల్ల నేల సారవంతం అయ్యి మట్టి మెత్తగా అవుతుందని అన్నారు. దానివల్ల కొబ్బరికాయలు పెరుగుదల ఉంటుందన్నారు. అందులో పెసర, మినుము, పిల్లి పెసర, కొర్ర రాగి తదితర పంటలు 30 రకాలు నవధాన్యాలు వేర్లు వ్యవస్థను పరిశీలించారు.










