నవాబుల కోటలోకి 'యువగళం'
ప్రజాశక్తి - బనగానపల్లె
యువగళం పాదయాత్ర నవాబుల కోటలోకి ప్రవేశించింది. శనివారం మండలంలోని కైప విడిది కేంద్రం నుండి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభమైంది. లోకేష్ పాదయాత్రకు జనం భారీగా కదిలి వచ్చారు. మాజీ ఎమ్మెల్యే బిసి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, నంద్యాల రోడ్డులోని రౌండ్‌ల వద్ద మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిర ఆధ్వర్యంలో మహిళలు లోకేష్ పాదయాత్రకు హారతులు పట్టి స్వాగతం పలికారు. లోకేష్ వెంట మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు గౌరు వెంకటరెడ్డి, మాజీమంత్రి ఎన్‌ఎండి ఫరూక్, డోన్ ఇన్చార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డి, ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, గొర్రెల పెంపకదారుల సహకార సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై.నాగేశ్వరరావు యాదవ్‌లు పాదయాత్రలో నడిచారు. పాదయాత్ర కైప విడిది కేంద్రం నుండి మిట్టపల్లి, బనగానపల్లె, ఇల్లూరు కొత్తపేట, గులాంపేట మీదుగా అమ్మడాల మెట్ట వరకు సాగింది. 15 కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టారు. ఆయా గ్రామాలలో ప్రజలు పలు సమస్యలను లోకేష్‌కు విన్నవించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలను పరిష్కరించి అందరికీ ఆమోదయోగ్యమైన పాలన అందిస్తామని లోకేష్ తెలిపారు. అనంతరం బనగానపల్లె పట్టణంలోని ఆస్థానం సమీపంలో ముస్లింలతో ముఖాముఖి నిర్వహించారు. పట్టణంలోని పొట్టి శ్రీరాములు కూడలిలో ఎస్టీ సామాజిక వర్గంతో, అవుకు మెట్ట సమీపంలో బుడగ జంగాలతో, ఇల్లూరు కొత్తపేట గ్రామంలో రైతులతో సమావేశం నిర్వహించారు. బుడగజంగాలు తమను ఎస్సీ జాబితాలో చేర్చాలని లోకేష్ దృష్టికి తెచ్చారు. సిఎం జగన్మోహన్ రెడ్డి ముస్లింలను దగా చేశారని, జగన్ పాలనలో వేధింపులు తాళలేక ముస్లింలు ఆత్మహత్య చేసుకుంటున్నారని నారా లోకేష్ తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన వెంటనే ముస్లింలకు న్యాయం చేస్తామన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, ప్రజల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచి బిసి రాజారెడ్డి, టిడిపి నియోజకవర్గ నాయకులు బిసి రామనాథరెడ్డి, మాజీ ఎంపిపి అంబాల రామకృష్ణారెడ్డి, ఎస్టి సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.వెంకటరమణ నాయక్, వాణిజ్య విభాగం నంద్యాల పార్లమెంటు అధ్యక్షులు టంగుటూరి శీనయ్య, తెలుగు యువత పార్లమెంటు అధ్యక్షులు బొబ్బల గోపాల్ రెడ్డి, మండల అధ్యక్షులు పివి కుమార్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఖాసింబాబు, పట్టణ ఉపసర్పంచ్ బురానుద్దీన్, పాతపాడు, మిట్టపల్లి సర్పంచులు బెడదల మహేశ్వరరెడ్డి, తులసి రెడ్డి, నాయకులు కృష్ణా నాయక్, వెంకటరాముడు నాయక్, రాయలసీమ సలాం, టిప్ టాప్ కలాం, లాయర్ నాగేంద్ర రెడ్డి, కొణిదెల పుల్లారెడ్డి, పవన్ కుమార్ రెడ్డి, పెద్దరాజుపాలెం భూషన్న, ఇల్లూరు కొత్తపేట మాజీ సర్పంచులు రామిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, కైప రఘునాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.










