ప్రజాశక్తి-కాజులూరు నవరత్నాల పథకాలు అమలుతో పేదల అభ్యున్నతి సాధ్యమైందని బిసి సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకష్ణ అన్నారు. బుధవారం మండలంలోని తిప్పరాజుపాలెం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వేణుగోపాల కష్ణ మాట్లాడారు. మహిళా సాధికారతకు వైఎస్‌ఆర్ చేయూత, వైఎస్‌ఆర్ ఆసరా, రైతుల సంక్షేమానికి వైఎస్‌ఆర్ రైతు భరోసా, ఉచిత పంటల బీమా ఇలా సమాజంలోని ప్రతివర్గం సంక్షేమం లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతత్వంలో రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లతో కలసి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. గడప గడపకూ వెళ్లి గ్రామ సచివాలయం ద్వారా ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ.. ఏయే కుటుంబాలకు ఏ పథకాల ద్వారా లబ్ధి జరిగిందో తెలిపారు. ప్రజలతో ముచ్చటించి స్థానికంగా ఏవైనా సమస్యలు ఉన్నాయా అని ఆరా తీశారు. ముఖ్యమంత్రి విద్యారంగంలో గతంలో ఎక్కడాలేని విధంగా, ఎప్పడూ లేని విధంగా వివిధ పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకాలను సద్వినియోగం చేసుకొని పిల్లలను బాగా చదివించాలని సూచించారు. పేదరికంపై పోరాటానికి విద్య అత్యుత్తమ మార్గమని పేర్కొన్నారు. గతంలో రేషన్‌కార్డు కావాలన్నా.. పెన్షన్ కావాలన్నా.. ఎక్కడెక్కడికో తిరగాల్సిన పరిస్థితి ఉందని.. ఇప్పుడు ఆ పరిస్థితిలో సమూలంగా మార్పు వచ్చిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి సుబ్బారావు, ఎంపిపి ఎం.భారతి మురళి, మండల పరిషత్తు ఉపాధ్యక్షులు పెద్దిరెడ్డి వెంకటరమణ ఎంపిటిసి సీత, సర్పంచ్ మాణిక్యాంబ ఆంజనేయ ప్రసాద్, తహశీల్దార్ సాయి సత్యనారాయణ, ఎంపిడిఒ రతన్‌రాజు, మండల బిసి సెల్ కన్వీనర్ గుబ్బల యేసు రాజు, పాల్గొన్నారు.










