ప్రజాశక్తి - పోలవరం
మండలంలోని కొత్త పట్టిసీమ గ్రామ సచివాలయంలో నూతనంగా 44 మందికి ఫించన్లు మంజూరయ్యాయని సర్పంచి మైగాపుల విజయదుర్గ తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు జిల్లా ఎంపీపీ సంఘాల అధ్యక్షులు పోలవరం ఎంపీపీ సుంకర వెంకట రెడ్డి చేతుల మీదుగా నూతన ఫించన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి వలవల వరలక్ష్మి, ఉప సర్పంచి రంభ వాసు, వైసిపి సీనియర్ నాయకులు మైగాపుల దుర్గాప్రసాద్, వలవల బాలాజీ, సచివాలయ కార్యదర్శి సుబ్రహ్మణ్యం, వార్డు మెంబర్లు, వాలంటీర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.










