Dec 21,2022 00:43

ధర్నానుద్దేశించి మాట్లాడుతున్న రామస్వామి

ప్రజాశక్తి-ఉక్కునగరం : స్టీల్‌ కార్మికులకు తక్షణం నూతన వేతనాలు అమలుచేయాలని స్టీల్‌ సిఐటియు ప్రధాన కార్యదర్శి రామస్వామి యాజమాన్యాన్ని డిమాండ్‌ చేశారు. స్టీల్‌ సిఐటియు మిత్రపక్షాల ఆధ్వర్యాన ప్లాంట్‌లోని టి అండ్‌ డిసి కూడలి వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ, వేతన ఒప్పందాలు జరుగుతాయనిస్టీల్‌ కార్మికులకు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారని తెలిపారు. వేతన ఒప్పందం సెయిల్‌ కార్మికులకు అమలవుతోందని, విశాఖ ఉక్కు కార్మికులకు మాత్రం అమలు కాలేదని తెలిపారు. కార్మిక వర్గం ఐక్యంగా యాజమాన్య వైఖరికి వ్యతిరేకంగా ఉద్యమాలతో ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ఈ ధర్నాలో స్టీల్‌ సిఐటియు నాయకులు ఎన్‌.రామారావు, పి.శ్రీనివాసరాజు, బి.అప్పారావు, యు.వెంకటేశ్వర్లు, మరిడయ్య, నీలకంఠం, పుల్లారావు, వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు, కార్మికులు పాల్గొన్నారు.