
ప్రజాశక్తి -సైదాపురం :మండల కేంద్రమైన సైదాపురంలో వినియోగదారుల అవసరాల నిమిత్తం, అదనంగా ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుకు విద్యుత్ అధికారులు శ్రీకారం చుట్టారు. సైదాపురం పంచాయతీలో రోజు, రోజుకు, విద్యుత్ వినియోగం పెరుగు తుండటంతో, వినియోగదారులు విద్యుత్ సరఫరా విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో అధికారులు, విని యోగదారుల అవసరాల నిమిత్తం గురువారం ట్రాన్స్ ఫార్మర్స్ ఏర్పాటు పనులను వేగవంతం చేశారు. సైదాపురం మండలం విద్యుత్ శాఖ ఏ.ఈ. శేషాద్రి ఆధ్వర్యంలో, లైన్ మెన్ అనీల్, తన సిబ్బందితో కలసి సైడాపురంలోని పలు ముఖ్యమైన చోట్ల నూతనంగా ట్రాన్స్ ఫార్మర్లు, పాడైపోయిన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్బంగా విద్యుత్ లైన్ మెన్ అనీల్ మాట్లాడుతూ అదనంగా ఏర్పాటు చేస్తున్న ట్రాన్స్ ఫార్మర్స్ వల , వినియోగదారులు,విద్యుత్ విషయంలో పడుతున్న సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని తెలిపారు. పునరుద్దరణ పనుల వల్ల విద్యుత్ సరఫరాకు కొంత మేర అంతరాయం ఏర్పాడుతుందన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.