Apr 14,2023 22:54

ప్రజాశక్తి-విజయవాడ: కృష్ణానది తీరాన ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణవేణి మాత విగ్రహానికి మానాశికం పట్టీలు కలశంలను ప్రజలను ఆకట్టుకునే విధంగా నూతన సొభగులతో తీర్చిదిద్దినట్లు జిల్లా కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు తెలిపారు. ప్రకాశం బ్యారేజ్‌ వద్ద మరమ్మతుల అనంతరం నూతన సొబగులతో తీర్చిదిద్దిన కృష్ణవేణి మాత విగ్రహాన్ని శుక్రవారం కలెక్టర్‌, మున్సిపల్‌ కమీషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుడ్కర్‌, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ఇటీవల కృష్ణావేణి విగ్రహం, ప్రాంగణాన్ని గమనించిన సిఎం పూర్వ వైభవాన్ని తీసుకురావాలని ఆదేశించారన్నారు. దీంతో కనకదుర్గ దేవస్థానం నిధులు రూ.3.10 లక్షలతో కృష్ణావేణి విగ్రహానికి మరమ్మతులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కనకదుర్గ దేవస్థానం చైర్మన్‌ కర్నాటి రాంబాబు, ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ డి.భ్రమరాంబ, ఇఇ ఎల్‌ రమ, జలవనరుల శాఖ ఇఇ కృష్ణరావు దుర్గామల్లేశ్వర దేవస్థానం జలవనరుల శాఖ సిబ్బంది పొల్గొన్నారు.