ప్రజాశక్తి - పోలవరం
పాత పట్టిసీమలో సోమవారం నూతనంగా నిర్మించిన సచివాలయాన్ని పోలవరం ఎంఎల్‌ఎ తెల్లం బాలరాజు ప్రారంభించారు. అనంతరం 'గడపగడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో పాల్గొని ప్రజలు సమస్యలు తెలుసుకున్నారు. వాటిని తొందరగా పరీక్షించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పోలవరం ఎంపిపి సుంకర వెంకట రెడ్డి, ఎంపిడిఒ జి.శ్రీను, తహశీల్దార్ బి.సుమతి, జడ్‌పిటిసి కలుమ్ హేమ కుమారి, పట్టిసీమ సర్పంచి సబ్బవరపు శ్రీరామమూర్తి, వైసిపి మండల కన్వీనర్ బుగ్గ మురళీకృష్ణ, సొసైటీ ప్రెసిడెంట్ పాదం రాజబాబు, గూటాల సొసైటీ ప్రెసిడెంట్ సుంకర అంజిబాబు పాల్గొన్నారు.










