అచ్చంపేట: రాముని గెలవాలంటే రక్షతలంతా అవు తారంటూ రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత అన్నారు. బుధవారం సాయంత్రం అచ్చంపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో రూ.2 కోట్ల 50 లక్షలతో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ ను ఆమె ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల గురించి ప్రస్తావించారు. అధికార దాహంతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అవినీతికి పాల్పడి జైలు పాలయ్యారన్నారు సిబిఐ దర్యాప్తులో అనేక వాస్తవాలు బయట పడటంతో అరెస్టు తప్పదని అనేక కుయుక్తులతో కోర్టులను రిమాండ్ కు పంపిన న్యాయ మూర్తులు పైన కూడా అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్‌కు వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక ప్రతిపక్షానికి దత్తపుత్రుడైన పవన్ కళ్యాణ్ వైసిపిని ఓడించాలని అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ రాజధాని పేరుతో వేల ఎకరాలు బినామీర్ల పేర్లతో టిడిపి నాయకుల చేతుల్లోకి వెళ్ళాయన్నారు.










