ఫొటో : పింఛన్లు అంజేస్తున్న వైసిపి నాయకులు
నూతన పింఛన్లు పంపిణీ
ప్రజాశక్తి-మర్రిపాడు : పల్లవోలు సచివాలయం పరిధిలోని తిక్కవరం గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన నూతన పింఛన్‌లను వైసిపి నాయకులు చండ్ర నారాయణ స్వామి, సర్పంచ్ రమాదేవి శుక్రవారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, శాసనసభ్యులు మేకపాటి విక్రమ్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో సచివాలయ కన్వీనర్ బోయపాటి నాగేశ్వరరావు, వెల్ఫేర్ అసిస్టెంట్ ఎర్రగంగు జగదీష్, బోయపాటి సుబ్బరాయుడు, గంగినేని వినోద్, గంగినేని అనిల్, ముప్పాళ్ల. హజరత్తయ్య, పెన్షన్ లబ్ధిదారులు, వలంటీర్ బోయపాటి.మహేశ్వరి పాల్గొన్నారు.










