పరిశీలిస్తున్న ఎంపిడిఒ
ప్రజాశక్తి- కోటవురట్ల:మండల కేంద్రంలో గురువారం ఎంపీడీవో చంద్రశేఖర్ సామాజిక పించన్ల తనిఖీ చేపట్టారు. ఇటీవల కొత్తగా మంజూరైన సామాజిక పింఛన్ల లబ్ధిదారుల నుండి ధ్రువీకరణ పత్రాలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వచ్చే నెల నుండి రూ.2750 చొప్పున పింఛన్ అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అనిల్ కుమార్, కోటవుట్ల ఎంపీటీసీ సూర్యరావు, కార్యదర్శి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
గొలుగొండ:ఏఎల్‌పురం సచివాలయంలో ఎంపిడిఒ డేవిడ్‌రాజు గురువారం కొత్త పింఛనుదారుల దరఖాస్తులు గురువారం పరిశీలించారు. వచ్చే నెలలో కొత్త ఫించన్లు మంజూరైన నేపధ్యంలో దరఖాస్తులు చేసుకున్న వారి సర్టిఫికేట్లు, ఇతర పింఛన్ల తనిఖీ చేశారు.










