ప్రజాశక్తి-చినగంజాం: మండలంలోని చిన్నగంజాం బైపాస్ రోడ్‌లో అడవికుదురు ఎంపీటీసీ ఆమంచి సుబ్బారావుకు చెంది న ఐఓసీఎల్ నూతన నందన ఫిల్లింగ్ స్టేషన్ శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైసిపి పర్చూరు ఇన్‌ఛార్జి ఆమంచి కృష్ణమోహన్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ముందుగా పెట్రోల్ బంకు ఆవరణలో కొబ్బరికాయ కొట్టి వాహనాలకు పెట్రోల్ నింపి ఆమంచి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జువ్వా శివరాం ప్రసాద్, దేవరపల్లి ఉప సర్పంచ్ తోకల కృష్ణమోహన్, ఎంపీటీసీ సుబ్బారెడ్డి, నాగాంజి, వైస్ ఎంపీపీ బాబురావు, మున్నం నాగేశ్వర్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, శిఖరం రామకృష్ణ, రామకృష్ణ, చిన్నగంజాం మండలం బీసీ సెల్ వాటుపల్లి ప్రసాద్, ఎస్సి సెల్ అధ్యక్షుడు పాదర్తి ప్రకాష్, నూనె వెంకటేశ్వర్లు, మేడికొండ బాబు, తిరుపతిరావు, ఉప్పలపాటి అనిల్, అక్కల చంద్ర, పంతుల కృష్ణారెడ్డి, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










