Sep 12,2023 21:52

ఫొటో : మంజూరైన పెన్షన్లతో లబ్ధిదారులు

నూతన పెన్షన్లు పంపిణీ
ప్రజాశక్తి-కావలి : స్థానిక 22వ వార్డులో ''డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ నూతన పెన్షన్ల పంపిణీ'' కార్యక్రమాన్ని వార్డ్‌ ఇన్‌ఛార్జి వైసిపి జిల్లా కార్యదర్శి గంధం ప్రసన్న ఆంజనేయులు మంగళవారం స్థానిక సచివాల యంలో నూతన పింఛన్ల పంపిణీ చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదలకు ఆసరాగా డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ పెన్షన్లు పేదలకు ఎంతో ఆసరాగా ఉపయోగపడుతుందన్నారు. స్థానిక శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌ రెడ్డి సహకారంతో 22వ వార్డులో నూతనంగా 30 మందికి వివిధ రకాల పెన్షన్లను పంపిణీ చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఎస్‌.రమణమ్మ, ఎస్‌డి సాహిన, చలమయ్య, గోపూర్‌ జాన్‌, దానం విజయమ్మ తదితరులకు పంపిణీ చేశారు.
వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వంలో పార్టీలకతీతంగా ప్రతి పేదవారికి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ముందు కొనసాగుతుందన్నారు. 22వ వార్డులో ప్రతి గడపకు సంక్షేమ ఫలాలు అందుతుందని ఎంఎల్‌ఎ రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి సహకారంతో ప్రతి పేదవాడిని ఆదుకోవాలన్నారు. సంకల్పంతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్టీలు కతీతంగా ముందుకు సాగుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి పేదవారికి సంక్షేమ ఫలాలు అందించడంలో సచివాలయ సిబ్బంది వలంటీర్లు ముందుండాలని సమన్వయంతో పనిచేసి పార్టీకి మంచి పేరు తేవాలని, కావలి ఎంఎల్‌ఎగా రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డిని మూడోసారి గెలిపించుకొనేందుకు సంకల్పంతో ముందుకు సాగుదామన్నారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది బి.సురేష్‌, మల్లికార్జున, వార్డు వలంటీర్లు హైమావతి, రామ్‌ దుర్గ, సుభాని, తదితరులు పాల్గొన్నారు.