Dec 31,2022 23:41

మాట్లాడుతున్న సిపిఎం రంపచోడవరం జిల్లా కార్యదర్శి కిరణ్‌

ప్రజాశక్తి-విఅర్‌.పురం
సిపిఎం కార్యకర్తలు నూతన ఒరవడితో ప్రజా పోరాటలకు సిద్ధం కావాలని సిపిఎం రంపచోడవరం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్‌ పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రం రేఖపల్లిలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో కిరణ్‌ మాట్లాడుతూ నూతన సంవత్సరంలో అందరి జీవితాల్లో ఆనందాలను పంచాలని ఆకాంక్షించారు. సిపిఎం జిల్లా కమిటీ తరఫున మండల ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. గడిచిన ఏడాదిలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొని సిపిఎం కార్యకర్తలు అవిశ్రాంతంగా శ్రమించారన్నారు. ఇదే ఒరవడితో 2023లో రెట్టింపు ఉత్సాహంతో కార్యకర్తలు పార్టీ బలోపేతానికి విశాల ఉద్యమాలకు సిద్ధం కావాలన్నారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కార్యకర్తల పట్టుదల, కార్యదక్షతతో చేసే ప్రజాఉద్యమాలే ప్రధానమని తెలిపారు. సిపిఎం నాయకులు పంకు సత్తిబాబు అధ్యక్షతన ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారం లక్ష్మి, మాజీ ఎంపీపీ సున్నం నాగమ్మ, పార్టీ మండల కార్యదర్శి సోయం చిన్న బాబు, మాజీ ఎంపీటీసీ సున్నం పార్వతి, సర్పంచ్‌లు పూనెం సరోజిని, సర్పంచ్‌ పులి సంతోష్‌ కుమార్‌, సవరం మారయ్య, ఎంపిటిసిలు పూనెం ప్రదీప్‌ కుమార్‌, సిపిఎం నాయకులు సున్నం రంగమ్మ, గూటాల శ్రీనివాసరావు, తోడం రాజు, దారయ్య, రాజేశ్వరి, పోడియం రామ్మూర్తి, కారం సుందరయ్య, పులి ధర్మరాజు, కదల కొండారెడ్డి, వల్ల కృష్ణారెడ్డి, నాల్లారపు ప్రకాష్‌రావు, రాజేశ్వరి, గుండిపూడి లక్ష్మణరావు, ప్రకాష్‌రావు, ఖాదర్‌, తూర్రం బాబురావు, తదితరులు పాల్గొన్నారు.