Jul 03,2023 01:40
ప్రమాణం చేస్తున్న కరణం హనుమంతరావు

.ప్రజాశక్తి-పంగులూరు: రోటరీ క్లబ్‌ ఆఫ్‌ పంగులూరు నూతన కార్యవర్గం ప్రమాణం చేసింది. క్లబ్‌ నూతన అధ్యక్షుడిగా పంగులూరు గ్రామానికి చెందిన కరణం హనుమంత రావు, సెక్రటరీగా షేక్‌ కాలేషా వలి, ట్రెజరర్‌గా గుర్రం ఆంజ నేయులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం పంగు లూరులోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన డీజీఎన్‌ డాక్టర్‌ ఎస్వీ రాంప్రసాద్‌ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతమైన పంగు లూరు క్లబ్బు గత 16 సంవత్సరాలుగా అంచెలంచెలుగా ఎదుగుతూ, అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల ఆదరాభి మానాలు పొందటం గర్వకారణం అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా రోటరీ క్లబ్‌ అనేక రకాలుగా ప్రజలకు తన సేవలు అందిస్తూ విస్తత పరుస్తుందని అన్నారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ సమయంలో 40 అంబులెన్స్‌లను పంపి క్షతగాత్రులకు అనేక రకాల వైద్య సేవలు అందించిందని తెలిపారు. జూబ్లీహిల్స్‌ క్లబ్‌ ద్వారా గుండె జబ్బులు ఉన్న పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు నిర్వహిస్తున్నా మని, ఎవరి పిల్లలకు గుండె జబ్బులు ఉన్న ఎంతమందినైనా తీసుకొస్తే ఉచితంగా ఆపరేషన్‌ చేయిస్తామని రాంప్రసాద్‌ హామీ ఇచ్చారు. సైకిళ్లు, తోపుడు బండ్లు, కుట్టు మిషన్లు, ఇతర రకాల మరెన్నో ప్రజలకు ఉపయోగపడే వస్తువులను ప్రజలకు అందిస్తున్నామని, మన డిస్ట్రిక్‌ ద్వారానే ఎక్కువ సంఖ్యలో ఇవ్వటం ఆనందాన్ని కలిగిస్తున్నదని అన్నారు. పంగులూరు క్లబ్బులో సభ్యుల సంఖ్యను పెంచాలని, మరో ఏడాదిలోపు ప్రతి సభ్యుడు ఒక కొత్త సభ్యుని చేర్చే విధంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్లబ్‌ డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌ కొల్లా సింగారావు, అసిస్టెంట్‌ గవర్నర్‌ ఇంటూరి ఆంజనేయులు, మాజీ జెడ్పిటిసి బాచిన చెంచు ప్రసాద్‌, క్లబ్‌ సభ్యులు పలువురు ప్రసంగించారు. అంతకుముందు అధ్యక్షుడు హనుమంతరావు దంపతులను సభ్యులు సన్మానించారు.