ఎన్నికైన నూతన కార్యవర్గ సభ్యులు
ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్:ఏపీ ఆదివాసీ హక్కుల సాధన సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు నర్సీపట్నంలో జరిగాయి. జీవో 52ను ప్రభుత్వం రద్దు చేయాలని, నాన్ షెడ్యూల్‌లో ఉన్న ఆదివాసీ గ్రామాలను 5వ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా నూతన అధ్యక్షులుగా కళ్యాణంను ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా వి.మాడుగుల మండలానికి చెందిన అంపరంగి శ్రీను, కార్యదర్శిగా గొలుగొండ మండలానికి చెందిన వాడపల్లి సంజీవ్, ముఖ్య సలహాదారులుగా పిఎస్.అజరు కుమార్, కన్వీనర్లుగా సిహెచ్.తలుపులు, కిముడు కృష్ణ, కోశాధికారిగా కూడా కన్నం రెడ్డి, గౌరవ అధ్యక్షులుగా ఈరే శ్రీను, ఆడిటర్లను, ఆర్గనైజర్లను, కార్యవర్గ సభ్యులను, మీడియా ప్రతినిధులను వివిధ మండలాలకు చెందిన వారిని ఈ సమావేశంలో ఎన్నుకున్నారు.










