Aug 12,2023 21:17

ప్రమాణస్వీకారం చేస్తున్న ఆలయ నూతన ధర్మకర్తల మండలి సభ్యులు

ప్రజాశక్తి - గరుగుబిల్లి : మండలంలోని తోటపల్లిలో గల వెంకటేశ్వర స్వామి, కోదండ రామస్వామి వారి దేవస్థానాలకు నూతన ధర్మకర్తల మండలి సభ్యులు శనివారం అధిక శ్రావణ ఏకాదశి ప్రమాణ స్వీకారం చేశారు. కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి, శత్రుచర్ల పరీక్షిత్‌రాజు సమక్షంలో తోటపల్లి దేవస్థానం ఆలయ ప్రాంగణంలో నూతన ధర్మకర్తల మండలి చైర్మన్‌గా మర్రాపు సత్యనారాయణ , ధర్మకర్తలుగా బోను వాగ్దేవి, మార్కొండ నారాయణమ్మ, నందివాడ కనకమహాలక్ష్మి, కునుమూరు సాగర్‌, బుడ్డేపు ఇందుమతి, గంట్యాడ సింహాచలం, పళ్ళ పాపమ్మ, గౌరీ శంకర్‌ పాత్రో, ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా, వివి అప్పలాచార్యులును ఆలయ కార్య నిర్వహణ అధికారి బుద్ధ మహాలక్ష్మి నగేష్‌ ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా పరిషత్‌ ఉపాధ్యక్షులు మరిశర్ల బాపూజీ నాయుడు, కురుపాం ఎంపిపి శెట్టి పద్మావతి, పార్వతీపురం మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ జయ ప్రకాష్‌ నారాయణ (జయబాబు), తోటపల్లి గ్రామ పెద్దలు ఆవాల కన్నయ్య, డోల్లు పారినాయుడు, మాజీ ఎంపిపి ద్వారపురెడ్డి ధనుంజయరావు, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, కురుపాం, గుమ్మలక్ష్మీపురం మండలాల్లోని ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.