Nov 16,2023 22:20


ప్రజాశక్తి- బైరెడ్డిపల్లి
మండలంలోని లక్కనపల్లి గ్రామ పంచాయతీ కేంద్రంలోని గతంలో జరిగిన గడపగడపకు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకటే గౌడ ఇచ్చిన మాట ప్రకారం నూతన డ్రైనేజీ కాలువ నిర్మాణం ప్రారంభించారు. ఈ సందర్భంగా గురువారం వైసిపి సంయుక్త కార్యదర్శి కృష్ణమూర్తి, ఎంపిపి రెడ్డప్ప లక్కనపల్లి మసీదులోని నూతన మురుగునీటి కాలువ నిర్మాణ పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ క్రిష్ణారెడ్డి, పంచాయతీ కార్యదర్శి చిన్న సుబ్రమణ్యం, వైస్‌ సర్పంచ్‌ రాజేంద్ర, నాయకులు మణిరెడ్డి, ప్రభాకర్‌ రెడ్డి, ధనపాల్‌, ఖాదర్‌ బాషా పాల్గొన్నారు.