సచివాలయాన్ని ప్రారంభిస్తున్న డిప్యూటీ సిఎం రాజన్నదొర
ప్రజాశక్తి - మక్కువ : మండలంలోని ఎస్.పెద్దవలస, నంద పంచాయతీకి సంబంధించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర బుధవారం ప్రారంభించారు. మండలంలోని గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా బుధవారం పెద్దవలస పంచాయతీలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యులు మావుడి శ్రీనివాసరావు, స్థానిక సర్పంచ్ పూడి రమాదేవి, వైసిపి నాయకులు మావుడి రంగునాయుడు, తహశీల్దార్ ఎ.సూర్యనారాయణ, ఎంపిడిఒ సూర్యనారాయణ, ఇఒపిఆర్‌డి దేవకుమార్, హౌసింగ్ ఎఇ సింహాచలం, విద్యాశాఖ అధికారులు, శ్యామసుందర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు










