Aug 04,2023 00:36

నినాదాలు చేస్తున్న నాయకయులు

ప్రజాశక్తి-మాడుగుల:నూతన అటవీ సంరక్షణ చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ గురువారం నిర్వహించిన రాష్ట్ర వ్యాప్త మన్యం బందు మద్దతుగా 5 షెడ్యూల్‌ సాధన కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరసింహ మూర్తి అధ్వర్యంలో ఎం.గదబూరులో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన అటవీ హక్కుల చట్టంతో గిరిజనలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకొస్తున్న మోడీ ప్రభుత్వాన్ని అందరూ నిలదీయ వలసిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మ దేవుళ్ళు, బలిరెడ్డి నాగరాజు, జోగారావు, భూలోకమ్మ, గద్దమ్మ తదితరులు పాల్గొన్నారు.