ప్రజాశక్తి - పార్వతీపురంటౌన్ : పిల్లలంతా నులిపురుగులు నిర్మూలనకు మాత్రలు వేసుకోవాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని, విద్యార్థుకు నులిపురుగుల నిర్మూలనకు ఆల్బెండజోల్ మాత్రలు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాతూ 2-19 ఏళ్లలోపు విద్యార్థులంతా ఒక ఆల్బెండజోల్ మాత్ర వేసుకోవాలని చెప్పారు. ఈ మాత్రలు వల్ల ఎలాంటి ఇబ్బందులుండవని, ఏ విధమైన ఇబ్బందులు తలెత్తినా వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. జిల్లాలో బడికి వెళ్లే పిల్లలంతా ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ బి.జగన్నాదరావు, వైద్యాధికారులు భాస్కరరావు, విజయమోహన్, పి.లావణ్య. వై.యోగేశ్వర రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పివి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
కురుపాం : మండలంలోని మొండెంఖల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి బి.ప్రజ్ఞ మొండెంఖల్ పాఠశాల విద్యార్థులకు నులిపురుగులు మాత్రలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
గుమ్మలక్ష్మీపురం : విద్యార్థులు నూలు పురుగుల బారిన పడకుండా ఉండేందుకు పంపిణీ చేస్తున్న మాత్రలు సద్వినియోగం చేసుకోవాలని ఎల్విన్ పేట సర్పంచి ఆర్ చైతన్య స్రవంతి సూచించారు. భద్రగిరి గిరిజన గురుకుల బాలికల పాఠశాలలో విద్యార్థులకు నూలు పురుగు మాత్రలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపిడిఒ సాల్మన్ రాజు, పంచాయతీ కార్యదర్శి మీనాక శ్యామల,ఉపాధ్యాయులు ఉన్నారు.
కొమరాడ : బిఆర్ అంబేద్కర్ పాఠశాల కేజీబీవీ, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాల్లో, పాఠశాలల్లో పిల్లలు, విద్యార్దులకు ఆల్బెండజోల్ మాత్రలు వేయడాన్ని స్థానిక పిహెచ్‌సి వైద్యాధికారి అరుణ్‌కుమార్ పరిశీలించారు. కార్యక్రమంలో అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మి, ఆయా పాఠశాల సిబ్బంది అంగన్వాడి సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
వీరఘట్టం: మండలంలోని వీరఘట్టం, బిటివాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో విద్యార్థులకు నులు పురుగు మాత్రలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యాధికారులు పి.ఉమామహేశ్వరి, మానస సూపర్వైజర్లు పార్వతీ, శాంతకుమారి ,నయమి, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు, పాల్గొన్నారు.
భామిని : స్థానిక అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఆల్బండ్జోల్ మాత్రలును ఎంఇఒ భాస్కర్‌రావు, పిహెచ్‌సి వైద్యాధికారి డాక్టర్ ఫణికుమార్ విద్యార్థులకు అందజేశారు. కార్యక్రమంలో డాక్టర్ సోయల్, అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ విజయ నిర్మల, ఇతర సిబ్బంది వున్నారు.
గరుగుబిల్లి: మండలంలోని రావివలస పిహెచ్‌సి పిల్లలకు నులిపురుగులు నిర్మూలనకు మాత్రలను జిల్లా ఎపిడిమాలజిస్ట్ డాక్టర్ నవీన్ కుమార్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రావివలస పిహెచ్‌సి వైద్యాధికారిని డాక్టర్ కర్రి అరుణకుమారి వైద్య సిబ్బంది గుంట్రెడ్డి సురేష్ కుమార్, శ్రీలత, అరుణ, ఆశావర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
సీతానగరం:మండలంలో నిడగల్లు, సూరంపేట గ్రామాల్లో నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి (డిఐఒ) డాక్టర్ టి. జగన్మోహనరావు గురువారం పరిశీలించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎమ్. శివున్నాయుడు, ఎ.రూపావతి, సూపర్ వైజర్స్ జయగౌడ్, గోపాలరావు, వైద్య సిబ్బంది గౌరీశ్వరి, శ్రావణి, ధరణి, అంగన్వాడి సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.










