ప్రజాశక్తి - నూజివీడు రూరల్
అకాల వర్షాలు, ఈదురుగాలులతో ఏటా నష్టపోతున్న మామిడి రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాలిపోయిన, దెబ్బతిన్న మామిడి కాయలను కొనుగోలు చేసి పౌడర్ తయారు చేసే ప్రాసెసింగ్ యూనిట్‌ను రూ.5 కోట్ల వ్యయంతో నూజివీడులో ఏర్పాటు చేయనుంది. ఈ పరిశ్రమలో వెయ్యి మంది మహిళలకు రూ.50 లక్షల భాగస్వామ్యం కల్పించి మిగిలిన మొత్తాన్ని రాయితీ ఇవ్వనుంది. దీనివల్ల ఏలూరు, కృష్ణా జిల్లాల మామిడి రైతులకు లబ్ధి చేకూరనుంది.










