ప్రజాశక్తి - నూజివీడు
నూజివీడు బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా ఇందుపల్లి సత్యప్రకాష్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక బార్ అసోసియేషన్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమానికి ఎన్నికల అధికారిగా సీనియర్ న్యాయవాది ఎల్.రాజారావు వ్యవహరించారు. వైస్ ప్రెసిడెంట్‌గా రాణిమేకల సత్యనారాయణ, జనరల్ సెక్రటరీగా మడుపల్లి మధురవిశంకర్, జాయింట్ సెక్రటరీగా అక్కినేని వెంకటరామకుమారి, ట్రెజరర్‌గా మల్లవల్లి రమేష్, లైబ్రేరియన్‌గా పొన్నంపల్లి దుర్గారావు, ఉమెన్ రిప్రజెంటేటివ్‌గా ఎన్‌విఎన్‌కె.దుర్గాపద్మాంజలిలను అసోసియేషన్ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన భారత అసోసియేషన్ అధ్యక్షులు ఇందుపల్లి సత్యప్రకాష్, అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని న్యాయవాదులు, పలు ప్రజా సంఘాల నేతలు, సామాజికవేత్తలు అభినందించారు.










