
ముసునూరు : నూజివీడు నియోజకవర్గంలో అభివృద్ధి సాధించడం తమకే సాధ్యమని, ఎంతమంది ఎంఎల్‌లు వచ్చినప్పటికీ నూజివీడు అభివృద్ధిలో శూన్యమని మాజీ ఎంఎల్‌ఎ చిన్నం రామకోటయ్య అన్నారు. ఆదివారం మండలంలోని చెక్కపల్లి గ్రామంలో మండలంలోని 16 గ్రామాల నాయకులతో కలిసి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు పూరైనప్పటికీ, నూజివీడు వెళ్లాలన్నా, మండల కేంద్రమైన ముసునూరు వెళ్లాలన్నా, వర్షం వస్తే వాగులు, వంకలు దాటాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. నూజివీడు పట్టణం గత 50 సంవత్సరాల క్రితం ఎలా వుందో, ఇప్పటికీ అలాగే ఉందన్నారు. రోడ్ల దుస్థితి బాలేదని, నిరుద్యోగ యువతకి ఉపాధి లేదని విమర్శించారు. అనంతరం చాట్రాయి మండలం చిన్నంపేట వార్డు సభ్యులు సుగుణరావు తమ అనుచరులతో కలిసి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముసునూరు, చెక్కపల్లి, పాల్గొన్నారు.