ప్రజాశక్తి-జమ్మలమడుగు : కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో నాటు బాంబు కలకలం రేపింది. జమ్మలమడుగు పట్టణం ముద్దునూరు రోడ్డు పెన్నా నది సమీపాన గల ప్లాట్లల్లో ఒక నాటు బాంబు లభ్యమైంది. గతంలో నాటు బాంబులు దొరికిన చోటులోనే మరికొక బాంబు ఈ రోజు దొరికిందని సమాచారం. విషయం తెలుసుకున్న డిఎస్పీ నాగరాజు, సిఐ సదా శివయ్య నాటు బాంబు లభ్యమైన స్థలానికి చేరుకున్నారు.










