ప్రజాశక్తి - పుత్తూరు టౌన్ : మే 13న జరగబోవు జాతీయ లోకాదాలతోను విజయవంతం చేయాలని పుత్తూరు సీనియర్ సివిల్ జడ్జి ఎస్సీ రాఘవేంద్ర పేర్కొన్నారు. శనివారం పుత్తూరు కోర్టు ఆవరణములో మధ్యాహ్నం. పోలీసు శాఖ అధికారుల న్యాయవాదులతో కలిపి సీనియర్ సివిల్ జడ్జి రాఘవేంద్ర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీకి లోబడిన క్రిమినల్ కేసులను అధిక సంఖ్యలో రాజీ చాయాలని పోలీసు అధికారులను కోరినారు. క్రిమినల్ కేసులతో ముడిపడిన సివిల్ కేసులను కూడా రాజి చేయాలన్నారు. తద్వారా విలువైన కోర్టు సమయముంతో పాటు కక్ష దారులు సమయం ధనం ఆదావుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పుత్తూరు న్యాయవాదులు కే పురుషోత్తం, మురుగేషన్ రెడ్డి, శేషాచలం, పుత్తూరు పోలీస్ శాఖ సిఐ లక్ష్మీనారాయణ, కార్వేటినగరం సీఐ చంద్రశేఖర్, పుత్తూరు కోర్టు పరిధిలో గల ఎస్సైలు కోర్ట్ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.










