రాయచోటి : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కోసం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా భవన నిర్మాణ పనులను రూ.22 కోట్లతో మొదలుపెట్టింది. భవన నిర్మాణానికి బిల్లులు సకాలంలో అందకపోవడంతో నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. 2022 డిసెంబర్ చివరికల్లా పూర్తి కావాల్సిన ఈ భవనం సకాలంలో కాంట్రాక్టర్‌కు బిల్లులు అందకపోవడంతో భవన నిర్మాణ పనులు సాగుతున్నాయి. 2023 డిసెంబర్ నాటికన్నా భవనం పూర్త అయితే తప్ప రోగులకు మెరుగైన వైద్య సేవలు అందెటట్లు లేవు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడంతో నిర్మాణ పనులు నిదానంగా సాగుతున్నాయి. రాయచోటి జిల్లా కేంద్రమె ౖనప్పటికీ ప్రధాన ఆసుపత్రి కేంద్రంలో చాలినన్ని బెడ్లు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం ఆసుపత్రికి రాయచోటి చుట్టుపక్కల ప్రాంతాలైన గాలివీడు, రామాపురం, చిన్నమండెం, సుండుపల్లి, లక్కిరెడ్డిపల్లి, తదితర ప్రాంతాల నుంచి రోజుకు 1200 నుండి 1500 వరకు సంఖ్యలో వైద్య సేవల కోసం వస్తున్నారు. గర్భిణులు కూడా ఆస్పత్రికి వైద్య సేవల కోసం వస్తూ ఉంటారు. కడప - చిత్తూరు, కడప- బెంగళూరు జాతీయ రహదారి కావడం గువ్వల చెరువు ఘాట్ దగ్గరగా ఉండడంతో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ప్రమాదంలో గాయపడిన వారిని రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తూ ఉంటారు. రోగులకు కావలసినవి సౌకర్యాలు, మౌలిక వసతులు అంతంత మాత్రమే ఉండడం గమనార్హం. కొత్త భవన నిర్మాణం పూర్తయితే వంద పడకల ఆసుపత్రి ద్వారా మరిన్ని మెరుగైన సేవలు అందించేందుకు వీలుంటుందని ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు. ఆసుపత్రిలోని ఎక్స్‌రే కేంద్రంలో పాతకాలం నాటి మిషనర్ ఉంది. కొత్త భవనం వస్తే దాని స్థానంలో మరొ కొత్త మిషనరీ మంజూరై మరింత వైద్య సేవలు అందే అవకాశముందని పలువురు చర్చించుకుంటున్నారు.రోగులకు మినరల్ వాటర్ అందుబాటులో తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆసుపత్రి పరిసరాల్లో ఎప్పటికప్పుడూ పారిశుధ్య పనులు చేపడితే తప్ప రోగాలు ప్రబలకుండా ఉంటాయని పలువురు వాపోతున్నారు. నిత్యం జనాలతో కిటకిటలాడే ప్రభుత్వా సుపత్రిలో మరిన్ని మెరుగు మెరుగైన వైద్య సేవలు భవన నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేయాల్సిన ఉంది. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి ఆసుపత్రి భవన నిర్మాణానికి సకాలంలో బిల్లులు చెల్లించి భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
నిర్మాణం పనులు వేగవంతం చేయాలి
వంద పడుకల ఆసుపత్రి నిర్మాణ పనులను వేగవంతం చేయాలి. అలాగే ఆస్పత్రి ఆవరణంలో తాగడానికి మంచినీటి సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నాం .మంచినీటి సౌకర్యన్ని వేంటనే ఏర్పాటు చేయాలి.
-ఎం .నరసింహులు, వెలిగల్లు, గాలివీడు,మండలం.
మౌలిక సదుపాయాలు చాలా కీలకం
సాధారణంగా వైద్య సౌక ర్యాలు అందుబాటులో ఉన్న ప్రాంతం అభివద్ధి అయ్యిందని అంటారు. జిల్లా కేంద్రమైన రాయచోటి పట్టణంలో మెరుగైన వైద్యం లేక పోవడం బాధాకరం. అత్యవసర కేసులన్నింటినీ కడపరిమ్స్ ఆసుపత్రికి లేదా తిరుపతి రుయా ఆసుపత్రికి రెఫర్ చేయడం పరిపాటిగా మారింది. జిల్లా కేంద్రంలో వం ద పడకల ఆసుపత్రి నిర్మించాలని తలపెట్టినా పనులు నత్త నడకన సాగడం శోచనీయం. వంద పడకల ఆసుపత్రి నిర్మాణం త్వరితగతిన పూర్తి కావడంతో పాటు ఐసియూ, వెంటిలేటర్, ట్రామా కేర్ సౌకర్యాలు కూడా కల్పించాలి. -పి.శ్రీనివాసులు, సిపిఎం జిల్లా కార్యదర్శి.
మూడు నెలల్లో పూర్తి చేస్తాం
జిల్లా కేంద్రమైన రాయచోటి ప్రభుత్వ వంద పడగల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులను మూడు నెలల్లో పూర్తి చేస్తాం. గతంలో బిల్లులు లేటు కావడం జరిగింది. ప్రస్తుతం బిల్లులు సకాలంలో వస్తు న్నాయి. తను నూతనంగా బాధ్యతలు చేపట్టాను. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందజేస్తున్నాం.త్వరలో ఆసుపత్రి నిర్మాణ పనులను పూర్తి చేస్తాం.
-డాక్టర్ డెవిడ్, ఆస్పత్రి సూపరింటెండెంట్










