శిథిలావస్థలో ఉన్న భవనం
నత్తనడకన నిర్మాణాలు..!
ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు పూర్తి చేయడంలో
నిలువెత్తు నిర్లక్ష్యం
ప్రజాశక్తి-కావలిరూరల్:దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని అందరూ మురిసిపోతున్న వేళ మహాత్మాగాంధీ ఒక మాటన్నారు. మన దేశాన్ని మనమే పాలించుకోబోతున్నాం.. మంచిదే కానీ.. మనం గ్రామ స్వరాజ్యం సాధించినప్పుడే దేశానికి అసలైన స్వాతంత్య్రం వచ్చినట్టని అన్నారు. ఆయన సంకల్పానికి, ఆలోచనలకు అనుగుణంగా గాంధీజీ కలలగన్న గ్రామ స్వరాజ్య సాధనే లక్ష్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అనేది ప్రజలందరికీ చేరువ కావాలనే ఉద్దేశంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామస్థాయిలో సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చి ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు వలంటరీ వ్యవస్థ ద్వారా గడపగడపకు తీసుకొని పోవాలనే దఢ సంకల్పంతో గ్రామస్థాయిలో సచివాలయలను ఏర్పాటు చేయడం జరిగింది.
కావలి మండల పరిధిలోని పలు గ్రామాలలో సచివాలయం నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రభుత్వం ఏర్పడి నాలుగున్నర ఏళ్లు పూర్తి కావస్తున్న నేటికీ నిర్మాణాలు పూర్తి కాకపోవడం విశేషం.ఈ ప్రభుత్వంలో నిర్మాణాలు పూర్తవుతాయో లేదో అర్థం కాని పరిస్థితిలో అటు సచివాలయం సిబ్బంది, ఇటు ఆ గ్రామస్తులు.
కావలి నియోజకవర్గ పరిధిలోని సిరిపురం గ్రామంలో సచివాలయం నిర్మాణానికి ప్రభుత్వం 40 లక్షల రూపాయల అంచనాతో సచివాలయం భవనం ప్రారంభించారు. ప్రభుత్వం ఏర్పడి నేటికీ నాలుగున్నర ఏళ్లు అవుతున్న ఇప్పటికీ సచివాలయం భవనం పూర్తి కాలేదు. శ్లాబు వేసి ఒకటిన్నర సంవత్సరం అవుతుంది. అల వదిలేశారు. ఏళ్లు గడుస్తున్న ఈ భవనం నేటికి పూర్తి కాకపోవడం విశేషం. పాత కమ్యూనిటీ హాల్ భవనాల్లో చాలీచాలని గదులలో అవస్థలు పడుతూ విధులు నిర్వహిస్తున్న సచివాలయం సిబ్బంది .
సారాయిపాలెం గ్రామ పంచాయతీలో 40 లక్షల రూపాయలు అంచనాతో ఏర్పాటు చేసిన సచివాలయ భవనకి సకాలంలో నేటికీ పూర్తిస్థాయిలో బిల్లు రాకపోవడంతో ఆగిపోయిన నిర్మాణం పనులు. పాత పంచాయతీ భవనంలో విధులు నిర్వహిస్తున్న సచివాలయం సిబ్బంది.ఆముదలదిన్నె గ్రామ పంచాయతీలో 25 లక్షల రూపాయలతో గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. నేటికీ పూర్తిస్థాయిలో బిల్లులు రాకపోవడంతో భవన నిర్మాణ పనులు ఆగిపోయాయి. రేకుల షెడ్డులో విధులు నిర్వహిస్తున్న సచివాలయం సిబ్బంది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి సంక్షేమ పథకాలను వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రజలకు చేరవేస్తున్నామని ప్రచార ఆర్భాటాలు చేసే ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి ఈ సచివా లయాల పనులను పూర్తి చేసి వాడకంలోకి తీసుకొని రావాలని ఆ గ్రామాల్లోని ప్రజలు కోరుతున్నారు.










