ప్రజాశక్తి - పెనుమంట్ర
కార్తీక మాసం ప్రారంభం కావడంతో మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన నత్తా రామేశ్వరం, జుత్తిగ శైవక్షేత్రాలను యాత్రికులు సందర్శిస్తుంటారు. నత్తా రామేశ్వరం శివాలయంలో పారిశుధ్యంపై దృష్టి సారించడంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీధర్ విఫలమయ్యారని యాత్రికులు విమర్శిస్తున్నారు. సెలయేరులో నీరు శుభ్రపరచలేదని, మరుగుదొడ్ల పరిసరాల్లో అపరిశుభ్రత నెలకొందని యాత్రికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.