Jun 19,2023 21:36

సమావేశంలో మాట్లాడుతున్న వెంకటేశులు

ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌
గతేడాది కల్తీ పత్తి విత్తనాలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారమందించి ఆదుకోవాలని రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశులు, అయ్యప్ప డిమాండ్‌ చేశారు. సోమవారం పట్టణంలోని రైతుసంఘం కార్యాలయంలో నాయకులు శేఖర్‌ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నకిలీ కంపెనీలను బ్లాక్‌ లిస్టులో ఉంచాలని, బీమా పరిహారం చెల్లించాలని కోరారు. పత్తి, ఉల్లి, వేరుశనగ తదితర పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్‌ చేశారు. మండలంలో తాగు, సాగునీటి కోసం ప్రాజెక్టులు నిర్మించాలని, పంటలను జింకల బారి నుంచి రక్షించడానికి పార్కు ఏర్పాటు చేయాలని కోరారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించరాదన్నారు. రూ.3 లక్షల వరకు వడ్డీలేని రుణాలివ్వాలని, మండలంలో తనిఖీలు నిర్వహించి కల్తీ విత్తనాలు అమ్మే డీలర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. డిమాండ్ల సాధనకు ఈనెల 30న విజయవాడలో జరిగే మహాధర్నాలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మండల కమిటీ సభ్యులు హనుమంతు రెడ్డి, తిక్కన, బాష, రామాంజనేయులు పాల్గొన్నారు.