Oct 29,2023 00:53
జామాయిల్‌ మొక్కలను పరిశీలిస్తున్న ఆర్‌డిఒ జాన్‌ ఇర్విన్‌

ప్రజాశక్తి-సిఎస్‌ పురం: జామాయిల్‌ నష్ట పరిహారం నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని కనిగిరి ఆర్‌డిఒ జాన్‌ఇర్విన్‌ తెలిపారు. మండలంలోని ముసునూరు రెవెన్యూ పరిధిలోని కె అగ్రహారం గ్రామానికి చెందిన ఆశం రామయ్య అనే రైతు సర్వే నంబర్‌ 51లో జామాయిల్‌ సాగు చేశారు. అందులో నుంచి గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే రహదారి వెలుతుండటం వల్ల 400 జామాయిల్ల్‌ మొక్కలు పోతున్నాయని, అధికారులు మాత్రం 230 మొక్కలకు మాత్రమే నివేదికలు పంపి తక్కువ నష్టపరిహారం చూపారని రాష్ట్ర లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. రైతు ఫిర్యాదు మేరకు శనివారం కనిగిరి ఆర్‌డిఒ పి జాన్‌ఇర్విన్‌ రైతు జామాయిల్‌ తోటను పరిశీలించారు. అక్కడ ఉన్న మొక్కలను పరిశీలించారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని తెలిపారు. ఆయన వెంట తహశీల్దార్‌ షేక్‌ నాగులుమీరా, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.