Mar 31,2023 16:27

ఎమ్మెల్యే ను సన్మానిస్తున్న దృశ్యం

నష్టపోయిన రైతులను ఆదుకుంటాం
- ఎమ్మెల్యే గంగుల
ప్రజాశక్తి  -  చాగలమర్రి

      నియోజకవర్గంలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి హామి ఇచ్చారు.శుక్రవారం చాగలమర్రి మండలంలోని పెద్దవంగలి గ్రామంలో శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా రామాలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే గంగుల నానికి పూలమాలలతో ఘన స్వాగతం పలికారు.రాతిదూలం  పోటీలను ప్రారంభించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న, అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను హుటాహుటిన నియోజకవర్గానికి వచ్చి పరిశీలించి రైతులను పరామర్శించామన్నారు.పంట నష్టం వివరాలను ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకరాగా ఈ క్రాప్‌ బుకింగ్‌కు సంబంధం లేకుండా ఆదుకుంటామని హామి ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు.వర్షాల వల్ల రైతులు నష్టపోయిన విషయాన్ని ఎమ్మెల్యే అసెంబ్లీ లో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ విమర్సించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.మతిస్థిమితం లేకుండా మాజీ మంత్రి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.అనంతరం ఎమ్మెల్యే ను ఆలయ కమిటీ సభ్యులు మున్నయ్య,తదితరులు ఘనంగా సన్మానించారు.కార్యక్రమం లో సర్పంచ్‌ బంగారు షరీఫ్,ఎంపిపి వీరభద్రుడు,మండల కన్వీనర్ కుమార్ రెడ్డి,చాగలమర్రి మేజర్‌ గ్రామ పంచాయతి ఉపసర్పంచ్‌ షేక్ సోహెల్,వైస్‌ ఎంపిపి రఫి,ఎంపిటీసిలు లక్ష్మిరెడ్డి,పత్తినారాయణ,మాజీ జెడ్పిటిసి రామగురివి రెడ్డి,సింగిల్ విండో అధ్యక్షుడు దస్తగిరి,ఉప సర్పంచ్ బాలనరసింహులు,మాజీ సర్పంచ్ లు నరసింహులు,నర్సయ్య,వైసిపి   నాయకులు మాజీ సర్పంచ్ పుల్లయ్య,గౌస్‌పీరా,వెంకట్రామిరెడ్డి,బియ్యం షబ్బీర్,కమాల్‌, వెంకటేశ్వర్రెడ్డి,నరసింహా రెడ్డి,ముల్లా ఖాదర్ భాష, జబ్బార్‌,పంచాయితీ కార్యదర్శి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.