May 11,2023 02:27
మొక్కజొన్న పంటను పరిశీలిస్తున్న కలెక్టర్‌

ప్రజాశక్తి-నిజాంపట్నం: నష్టపోయిన రైతులు అధైర్య పడవద్దని, ప్రతి రైతును ఆదుకుంటామని జిల్లా కలెక్టర్‌ రంజిత్‌ బాషా తెలిపారు. నిజాంపట్నం మండలంలోని పల్లపట్ల పంచాయతీ, కూచినపూడి పంచాయతీల్లో వివిధ గ్రామాల్లో జిల్లా కలెక్టర్‌ రంజిత్‌ బాషా బుధవారం పంటను పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి రైతుకు ఎటువంటి నష్టం కలగకుండా ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. మొక్కజొన్న వేరుశనగ వరి పంటలు రంగు మారినా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జిల్లా అధికారి, మండల ఏవో వాగోలు బుష్‌, వివిధ శాఖల అధికారులు, రైతులు, నాయకులు పాల్గొన్నారు.