Oct 20,2023 20:40

ఆలూరులో ఎండిపోయిన వేరుశనగ పంటను పరిశీలిస్తున్న రామకృష్ణ

ప్రజాశక్తి-ఆలూరు
జిల్లాకు వర్షాలు సకాలంలో రాక ఖరీఫ్‌లో వేసుకున్న పంటలు ఎండిపోయి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆలూరుకు వచ్చిన రామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి బి.గిడ్డయ్య ఆలూరులోని పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రభుత్వం హంగు, ఆర్భాటాలపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని తెలిపారు. జిల్లాలో వర్షాల్లేక రైతులు అప్పుల చేసి పంటలు వేస్తే ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించి ఎకరాకు రూ.30 వేల నష్టపరిహారం అందించి, బ్యాంకు రుణాలను మాఫీ చేయాలని డిమాండ్‌ చేశారు. సిపిఐ జిల్లా సమితి సభ్యులు కె.భూపేష్‌, సిపిఐ మండల కార్యదర్శి పి.రామాంజనేయులు, కౌలు రైతుసంఘం జిల్లా కార్యదర్శి తిమ్మయ్య, ప్రజాసంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఆదోని (రూరల్‌) మండలం ఢణాపురం గ్రామంలో పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, జిల్లా కార్యదర్శి గిడ్డయ్య మాట్లాడారు. జిల్లాలోని పశ్చిమ ప్రాంతం ఆదోని, పత్తికొండ, ఆలూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాల్లో కరువు విలయ తాండవం చేస్తోందన్నారు. ఈ ప్రాంత ప్రజలు తాగునీటి కోసం అలమటిస్తున్నారని తెలిపారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె.లక్ష్మారెడ్డి, సిపిఐ పట్టణ, మండల కార్యదర్శులు సుదర్శన్‌, కల్లుబావిరాజు, పట్టణ, మండల సహాయ కార్యదర్శులు చిన్న నరసప్ప, విజరు, హర్షద్‌ వలీ, రైతు సంఘం నాయకులు ఎల్లప్ప, కౌలు రైతు సంఘం నాయకులు సత్యనారాయణ, ఎఐటియుసి పట్టణ కార్యదర్శి ఎంకప్ప, పట్టణ అధ్యక్షులు వైటి.భీమేష్‌, ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి సాబీర్‌ బాష, ప్రజాసంఘాల నాయకులు హనుమంతు, కరెంటు ఈరన్న, ఎఐవైఎఫ్‌ నాయకులు అంజి, రమేష్‌, ఎఐటియుసి జిల్లా సమితి సభ్యులు షేక్షావలీ పాల్గొన్నారు.

ఆదోనిలో రైతులతో మాట్లాడుతున్న నాయకులు
ఆదోనిలో రైతులతో మాట్లాడుతున్న నాయకులు